calender_icon.png 27 December, 2025 | 6:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెరుక సంఘం పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడిగా అల్లం తిరుపతి

27-12-2025 04:30:19 PM

మంథని,(విజయక్రాంతి): పెరుక సంఘం పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడిగా ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ అల్లం తిరుపతిని నియమించినట్లు పెరక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రంశెట్టి ముత్తయ్య  శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పెరిక కులస్తుల సమస్యలపై స్పందించి పనిచేయాలని, జిల్లా కమిటీకి ఆయన సూచించారు. తనపై నమ్మకంతో జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షునితో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్రె సురేందర్ కు జిల్లా అధ్యక్షుడు గోవిందుల ఆనంద్ కు కృతజ్ఞతలు తెలిపారు.