calender_icon.png 22 February, 2026 | 2:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిశ్రమలకు చేయూతనివ్వాలి!

10-02-2026 12:00:00 AM

దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా నిలిచి వృద్ధి పథంలో పయనించాలంటే తయారీ రంగం బలంగా ఉండాలి. ఉద్యోగాల సృష్టికి, సాంకేతిక పురోగతికి, స్థూల దేశీ యోత్పత్తి (జీడీపీ) పరిమాణం పెరిగేందుకు చిన్న పరిశ్రమలు కీలకం. ఈ క్రమంలో నేడు సూక్ష్మ, స్థూల, చిన్న (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలు దేశ ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. గడచిన రెండు, మూడు సంవత్సరాలుగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్లలో ఈ రంగానికి అత్యం త ప్రాధాన్యతను ఇస్తూ, అనేక రకాల ప్రోత్సాహకాలను ప్రకటిస్తూ వస్తోంది.

గత మూడేళ్లగా ప్రవేశపెడుతున్న బడ్జెట్లతో ఈ రంగం ఊపిరి పోసు కుందనే చెప్పవచ్చు. దేశం మొత్తం మీద సూక్ష్మ, స్థూల, చిన్న పరిశ్రమలు 5.70 కోట్లకు చేరాయి. కోటికి పైగా ఈ రంగానికి చెందిన పరిశ్రమలు రిజిస్టర్ అయ్యాయి. 7.50 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ ఏడాది 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను గత ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మ లా సీతారామన్ ప్రవేశపెట్టిన సందర్భంలో కూడా ప్రత్యేకంగా ఈ రంగం విస్తరణ గురించి అనేక విషయాలను ప్రస్తావించారు.

దేశ ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న సూక్ష్మ్ల, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలకు బడ్జెట్ పెద్దపీట వేసిందనే చెప్పవచ్చు. వీటిని ‘చాంపియన్లు’గా తయారు చేసే నిమిత్తం మూడు దశల వ్యూహాన్ని ప్రతిపాదిం చిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పదివేల కోట్ల రూపాయలతో నిధిని ప్రకటించారు. ఎంఎస్‌ఎంఈలకు ప్రస్తుతం హామీ లేకుండా ఇచ్చే రుణ మొత్తాన్ని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు చేర్చుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా ప్రకటించటం అభినందనీయం.

అయితే ఎంఎస్‌ఎంఈ రంగం చాలాకాలం దిక్కుతోచని స్థితిలో ఉండేది. కరోనా సంక్షోభం, వృద్ధిరేటు పతనం, రూపాయి పతనం, అంతర్జాతీయ పరిణామాలు ఈ రంగా న్ని కుదిపేశాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు క్రమం తప్పకుండా విద్యుత్‌ను సరఫరా చేయడమే కాకుండా, మార్కెటింగ్ సౌకర్యాలను విస్తరించిన భారత్‌లో 32 శాతం ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వ సంస్థలు, బ్యాం కుల నుంచి రుణాలు అందడం లేదు.

కార్మికుల నియామకాలను విస్తరించి, నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేసే కంపెనీలకు ప్రభుత్వం అండదం డలివ్వాలి. కార్పొరేట్ లాభాల కన్నా విశాల సమాజానికి పెద్దపీట వేయాలి. ఎంఎస్‌ఎమ్‌ఈల ఉత్నత్తులను విదేశాలకు ఎగుమతి చేయడంవల్ల విదేశీ మార కద్రవ్యం పొందే అవకాశం ఉంటుంది. దీనిలో భాగంగా ఈ హబ్‌లను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో నెలకొల్పి సాంప్రదాయ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించే వీలు కల్పించనున్నారు.

ఇంతటి ప్రాముఖ్యత కలిగిన దేశీయ తయారీ రంగాన్ని జోరెత్తించాలంటే ఎంఎస్‌ఎంఈలకు ఇతోధిక తోడ్పాటు అందించాలి. రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా జాతీయ దృక్పథంతో కేంద్రం, రాష్ట్రాలు చర్చించి రాబోయే రెండు దశాబ్దాల్లో తయారీ రంగంలో భారత్ అగ్రగామిగా ఎదగాలంటే ఇంకా ఎంతో కృషి అవసరం. ప్రభుత్వాలు ఈ రంగానికి ఎంత చేసినా తక్కువనే చెప్పాలి.  ఇవన్నీ సవ్యంగా ఉన్నప్పుడే ‘వికసిత్ భారత్’ లక్ష్యం నెరవేరుతుంది.

 రాధాకృష్ణ, నిజామాబాద్