7 July, 2026 | 6:28 PM

Breaking News

విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటమాడుతున్న ప్రైవేట్ పాఠశాలలు   •   "సర్" ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి   •   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వానికి ఏడాది.. రామాలయంలో ప్రత్యేక పూజలు   •   ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు   •   ప్రభుత్వ ఉచిత విద్యను, సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరాలి   •   విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పెద్దకాపర్తి సర్పంచ్   •   గౌలిగూడ కు వెళ్లాలా... అయితే ముక్కు మూయాల్సిందే...!   •   మృతుల కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం   •   డబుల్ మర్డర్ కేసులో సంచలన తీర్పు   •   విడతల వారీగా యూరియా ఇవ్వడం సరికాదు   •  

మెద‌క్‌లో బీఆర్ఎస్ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా దీక్షా దివ‌స్

29-11-2025 05:11 PM

* మ‌ళ్ళీ కేసీఆర్ సీఎం అయితేనే తెలంగాణ అభివృద్ధి

* జిల్లా పార్టీ అధ్య‌క్షురాలు ప‌ద్మాదేవేంద‌ర్‌రెడ్డి

మెద‌క్‌ (విజ‌య‌క్రాంతి): మెదక్ జిల్లా బీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు, మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం.పద్మ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్షా దివ‌స్ కార్యక్రమం శనివారం మెదక్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మదేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున గౌడ్, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు, మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్ర గౌడ్, జిల్లా నాయకులతో కలసి జిల్లా పార్టీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమరుల స్థూపానికి నివాళులు అర్పించారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

అనంతరం ఉద్యమం నాటి ఫోటో ఎగ్జిబిషన్లు ప్రారంభించి తిలకించారు. ఈ సంద‌ర్భంగా ప‌ద్మాదేవేంద‌ర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్ర‌జ‌లంద‌రు గుర్తు పెట్టుకునే రోజు దీక్షా దివ‌స్ అన్నారు. ప్ర‌త్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ దీక్ష బూని స‌బ్బండ వ‌ర్గాల అండ‌దండ‌ల‌తో ఉవ్వెత్తున ఉద్య‌మం ఎగిసి ప‌డి ప్ర‌త్యేక రాష్ట్రం సాధించుకున్నామ‌ని తెలిపారు. ప‌దేళ్ళ పాటు కేసీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉండి బంగారు తెలంగాణ వైపు అడుగులు వేశార‌ని గుర్తు చేశారు. తెలంగాణ కోసం కేసీఆర్ పోరాడితేనే నేడు రేవంత్‌రెడ్డి ముఖ్య‌మంత్రి సీట్లో కూర్చున్నాడ‌ని, కానీ బంగారు తెలంగాణ‌ను మ‌ళ్ళీ దిగ‌జార్చే ప్రయ‌త్నం జ‌రుగుతుంద‌న్నారు. ఇలాంటి ప‌రిస్థితి పోవాలంటే మ‌ళ్ళీ కేసీఆర్ ముఖ్య‌మంత్రి కావాల‌ని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు పాల్గొన్నారు.