7 July, 2026 | 7:33 PM

Breaking News

డిగ్రీ ప్రవేశాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానం   •   ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన వివిధ గ్రామ సర్పంచులు   •   గట్టుదుద్దెనపల్లి సంఘం చైర్మన్ గా గంగుల రామ్ రెడ్డి   •   సర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం   •   నాగిరెడ్డిపేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీల సంఖ్య పెంచాలి   •   17వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైన సుల్తానాబాద్ సాయిబాబా దేవాలయం   •   ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   అనగారిన వర్గాల... అభ్యున్నతి ఎమ్మార్పీఎస్ తోనే సాధ్యం   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఇందిరమ్మ ఇండ్ల వద్ద కరెంటు స్తంభాలు ఏర్పాటు   •  

గుడిబండ సర్పంచ్ రేసులో సామాజిక సేవకుడు ప్రభాకర్

29-11-2025 05:13 PM

కోదాడ: రానున్న గ్రామపంచాయితీ ఎన్నికల్లో గుడిబండ గ్రామపంచాయితీ సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి సామాజిక సేవకుడు పెరుమాళ్ళ ప్రభాకర్ సిద్ధమవడం గ్రామంలో రాజకీయ చర్చకు దారి తీస్తోంది. మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, బిఎల్ఐఎస్సి విద్యార్హతలు కలిగిన ప్రభాకర్ 2012 సంవత్సరం నుండి వివిధ జాతీయ స్థాయి సామాజిక సేవా సంస్థల్లో పలు హోదాల్లో పనిచేస్తూ అనేక మంది విద్యార్థులు, మహిళలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళా సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రధాన అజెండాగా తీసుకుని సర్పంచ్ ఎన్నికల రేసులోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. త్వరలో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గుడిబండ గ్రామ రాజకీయాల్లో కొత్త ఆసక్తి నెలకొంది.