15 June, 2026 | 2:27 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

భారత్ మాల రోడ్డు నిర్మాణ పనులను పరిశీలన

05-11-2024 05:24 PM

గద్వాల (విజయక్రాంతి): గద్వాల జిల్లా గట్టు మండలోని తప్పెట్ల మోరుసు, అరగిద్ద గ్రామంలో చేపడుతున్న భారత్ మాల నిర్మాణ పనులను మంగళవారం జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు, అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణతో కలిసి కలెక్టర్ సంతోష్ పరిశీలించారు. ఈ సందర్భంగా హైవే అథారిటీ అధికారులతో రహదారి నిర్మాణం సంబంధిత భూముల వివరాలను, భారత్ మాల రహదారి మ్యాపింగ్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రహదారి నిర్మాణంలో భాగంగా రైతుల భూములకు సర్వీస్‌ రోడ్లు, కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోని సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన కనెక్టివిటీ అందిస్తామని అన్నారు. నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సరిత రాణి, ఎన్.హెచ్.ఎ.ఐ ఇంజినీర్ సురేందర్, సంబంధిత అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.