13 June, 2026 | 4:13 PM

Breaking News

మీనాక్షి నటరాజన్ కు.. కేసుకు అసలు సంబంధమే లేదు   •   జూనియర్ అథ్లెటిక్స్ లో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలకు రెండు కాంస్య పతకాలు   •   జూనియర్ అథ్లెటిక్స్ లో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలకు రెండు కాంస్య పతకాలు   •   అడవి శ్రీరాంపూర్‌లో సమ్మయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   ట్రాక్టర్ బోల్తా... డ్రైవర్ మృతి   •   అనగనగా ఓ డిటి.. రక్త దానం   •   అభివృద్దే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం   •   ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరగాలి   •   'వీబీజీ రామ్-జీ' పథకంపై కేంద్రానికి వ్యతిరేకంగా లేఖ రాస్తాం   •   అటవీ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిరాసత్ అలీ బాక్రీ వినతిపత్రం   •  

సీఎం రేవంత్ మూసి పాదయాత్ర సభాస్థలి పరిశీలించిన ఎంపీ చామల

05-11-2024 05:59 PM

యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి జిల్లా పర్యటన సందర్భంగా సభా స్థలం ఏర్పాట్లను భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మ రెడ్డి, యాదాద్రి జిల్లా కలెక్టర్ హనమంత రావు, డీసీపీ రాజేష్ చంద్ర మంగళవారం పరిశీలించారు. ఈనెల 8న రాష్ట్ర ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి తన జన్మదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వలిగొండ మండలం సంగెం గ్రామంలో మూసి వంతెన వద్ద మూసి పునర్జీవంపై రైతులతో మాట్లాడి సమావేశం కానున్న స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.