21 August, 2026 | 9:48 PM

Breaking News

ఈ నెల 23న శ్రీశైలంలో శ్రీశైల మాహాత్మ్యం పుస్తకావిష్కరణ   •   పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటికి వినతి పత్రం అందజేత   •   భక్తిశ్రద్ధలతో వాసవి అమ్మవారి జీవిత చరిత్ర ప్రవచనాలు   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలి   •   రూపారెడ్డి హత్యకు నిరసనగా భారీ ర్యాలీ   •   పోచమ్మ దేవాలయ విగ్రహ పున:ప్రతిష్ఠాపన వేడుకలు ప్రారంభం   •   కడుపునొప్పి భరించలేక విద్యార్థిని బలవన్మరణం   •   అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారే   •   రాయినిగూడెంలో బీజేపీ జెండా దిమ్మె తొలగింపు సరికాదు   •   ఆలేరు పోలీసుల తనిఖీల్లో 30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం   •  

బెల్లల్ ఇందిరమ్మ కాలనీలో ఆర్డీవో తహసీల్దార్ పరిశీలన

21-08-2026 09:14 PM

బోధన్,(విజయక్రాంతి): బోధన్ మండలంలోని బెల్లల్ ఇందిరమ్మ కాలనీలో ఇళ్ల పైకప్పులు కురుస్తున్న నేపథ్యంలో బాధితులకు రేకులు ఏర్పాటు చేసే చర్యల్లో భాగంగా ఆర్డీవో ఎం.విజయకుమారి, తహసీల్దార్ విఠల్ శుక్రవారం కాలనీని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు కాలనీకి వెళ్లి ఇళ్లను పరిశీలించారు. ఇళ్ల పరిస్థితి, వర్షాల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చర్యలు చేపట్టి పైకప్పులకు రేకులు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.