2 July, 2026 | 12:03 PM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

స్ఫూర్తిదాయకంగా అల్ఫోర్స్ ట్రైనీటాట్స్ వార్షికోత్సవ వేడుకలు

20-03-2025 12:00 AM

కరీంనగర్ క్రైమ్, మార్చి19 (విజయక్రాంతి): విద్యార్థులకు క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమని  క్రమశిక్షణతో అపూర్వ విజయాలు సొంతం చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ పమెలా సత్పతి అన్నారు,  అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి తో కలిసి స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనిటాట్స్ ప్రాంగణంలో ‘ఫ్లోరెంట్‘ పేరుతో విర్వహించినటువంటి  వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైవారు.

ఈ సందర్భంగా  మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా కృషిచేసి అన్ని రంగాలలో పై చేయి సాధించడమే కాకుండా ఘనవిజయాలు నమోదు చేసి సమాజంలో గర్వించదగ్గ విద్యార్థులుగా ఉండాలని సూచిస్తూ ప్రతి ఒక్కరూ వారికి నేర్పినటువంటి విషయాలను  తప్పకుండా సాధన చేసి పట్టు సాధించినట్లయితే ఏ పోటీ పరీక్షల్లో అయిన విజయాన్ని సులభంగా సాధించడమే కాకుండా అత్యుత్తమ స్థానాల్లో స్థిరపడవచ్చని చెప్పారు. 

డాక్టర్ వి. నరేందర్ రెడ్డి  సారథ్యంలో విద్యార్థులు అన్ని రంగాల్లో పై చేయి సాధించడమే కాకుండా ఇతరులకు ఆదర్శంగా నిలవడం చాలా హర్షించదగ్గ విషయమని చెప్పారు.