తొర్రూర్‌లో బీరప్పస్వామి విగ్రహ ప్రతిష్ఠ
03-05-2026 12:00 AM
- రేపటి నుంచి మే 14 వరకు గామంలో ఉత్సవాలు
- ఆదిభట్ల మున్సిపల్ చైర్మన్‌ను ఆహ్వానించిన కురుమ సంఘం
ఇబ్రహీంపట్నం, మే 2(విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తొర్రూర్ గ్రామ బీరప్ప స్వామి, అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠాపన (పండుగ) నిర్వహణకు 50 వేల రూపాయలను ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్‌రెడ్డి శనివారం కురుమ సంఘం కుల పెద్దలకు అందజేశారు.
ఈనెల 4 నుంచి 14వ తేదీ వరకు అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో తొర్రూర్ గ్రామంలో 10 రోజులు నిర్వహించే దైవ కార్యక్రమాలకు (తొర్రూర్ కురుమ సంఘం) ఆధ్వర్యంలో మర్రి నిరంజన్ రెడ్డిని ఆహ్వానించారు. కార్యక్రమంలో పెద్ద కుర్మ సాగ లక్ష్మ య్య, కురుమ సంఘం కుల పెద్దలు మార్కె ట్ కమిటీ డైరెక్టర్ మేకం లక్ష్మి, జంగయ్య, లింగం, శ్రీశైలం, యాదగిరి, రాజు, యాదగిరి, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.






