25 June, 2026 | 3:22 PM

Breaking News

మైలార్‌దేవ్‌పల్లిలో అంతర్రాష్ట్ర నేరస్తుల అరెస్ట్   •   తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీక.   •   దళిత జర్నలిస్టుపై దాడిని ఖండిస్తున్నాం   •   ఉద్యమకారుల భూ పోరాటం విజయవంతం చేయాలి   •   విత్తన డీలర్లకు వ్యవసాయ నైపుణ్య పాఠాలు   •   నల్లమల అడవి నుంచి ఉడుముల అక్రమ రవాణా   •   డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి   •   కంటైనర్ ఢీకొని ఒకరి మృతి.. నలుగురికి గాయాలు   •   పక్క జిల్లాలకు నీళ్లు... కరీంనగర్ ప్రజలకు కన్నీళ్లు   •   చదువుకున్న పాఠశాల అభివృద్ధికి కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు ముందడుగు   •  

గోషామహల్‌లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక

03-05-2026 12:00 AM

పాల్గొన్న ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ సాయికుమార్

హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గోషామహల్ నియోజకవర్గంలో శనివారం ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ హాజరయ్యారు. ప్రజల సమస్యల పరిష్కారం, ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా జరిగిన ఈ సమావేశంలో స్థానిక ప్రజల ఆశలు, అవసరాలు, సమస్యలను నేరుగా తెలుసుకొని వాటికి శాశ్వత పరిష్కార మార్గాలపై విస్తృతంగా చర్చించారు.

ప్రజల భాగ స్వామ్యంతో ప్రజా సంక్షేమం సాధించాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లాలని మెట్టు సాయికుమార్ స్పష్టం చేశారు. ‘ప్రజలతో ప్రజల కోసం ప్రజల పాలన’ అనే నినాదంతో సాగుతున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గోషామహల్ నియోజకవర్గ అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేయనుందని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ పేర్కొన్నారు.