13 April, 2026 | 1:54 AM

దోరకుంటలో సీసీ కెమెరాల ఏర్పాటు

13-04-2026 12:00 AM

కోదాడ, ఏప్రిల్ 12: దోరకుంట గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన సీ.సీ కెమెరాలను కోదాడ రూరల్ ఎస్త్స్ర గోపాల్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సూర్యాపేట ఎస్పీ నరసింహ సహకారంతో దోరకుంట సర్పంచ్ పాలకి సురేష్ గ్రామ ప్రజల సహకారంతో గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగినదన్నారు.

త్వరలో మంత్రి ఉత్తమ కు మార్ రెడ్డి కోదాడ హుజూర్నగర్ గ్రామాల పరిధిలోగల సిసి కెమెరాలు ప్రారంభించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ పాలకి సురేష్,గ్రామ శాఖ అధ్యక్షుడు పత్తిపాక వెంకటే శ్వర్లు వార్డు మెంబర్ వనపర్తి పిచ్చయ్య, శీలం కోటేశ్వరరావు పత్తిపాక రమేష్, నోముల బాలకృష్ణ పాల్గొన్నారు.