అంబేద్కర్ విగ్రహానికి అవమానం
తల, చేతి వేలుపై పశువుల పేడ అంటించిన దుండగులు
అలంపూర్ మార్చి 9: గద్వాల జిల్లా మానవపాడు మండలం పెద్దపోతులపాడు గ్రామంలో సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగింది.ప్రధాన రహదారి వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో తల,చేతి వేలుపై పశువుల పేడను అంటించి అవమాన పర్చారు.జరిగిన ఘటనపై గ్రామస్తులు,దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ ను అవమాన పరిచిన నిందితులపై కఠిన చర్యలు తీ సుకోవాలని డిమాండ్ చేశారు.
అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగిందంటే యావత్ భారత జాతికి అవమానం జరిగినట్టు అని మండిపడ్డారు. తక్షణమే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినట్టు దళిత నాయకులు వాపోయారు.ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు మండల పోలీసు యంత్రాంగం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.




