10 March, 2026 | 3:20 AM

హైదరాబాద్‌లో రూపాయికే లగ్గం

10-03-2026 01:46 AM

రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో..

హైదరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): హైదరాబాద్ మహా నగరంలో రూపాయి ఫౌం డేషన్ చైర్మన్ అనిల్‌కుమార్, ప్రాజెక్టు చైర్మన్ జగిని జగిని శ్రీనివాస్, కో చైర్మన్ యడవెల్లి బాలరాజు ఆధ్వర్యంలో సైదాబాద్ డివిజన్, ఎస్‌బీహెచ్ కాలనీలోని శ్రీ శ్రీనివాస కమ్యూనిటీ హాల్‌లో నిరుపేద జంట చంద్రిక, చందర్‌లకు ఘనంగా వివాహం నిర్వహించారు. నాగమల్ల అనిల్ కుమార్, జగిని శ్రీనివాస్, బాలరాజు మా ట్లాడుతూ.. ‘ఓ నిరుపేద జంటకు పెళ్లి చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.

మా రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 14 పెళ్లిళ్లు చేశామని అన్నారు. పెళ్లికి సహా యం చేయాలని వారు మమ్మల్ని సంప్రదించగా వారికి పెళ్లి బట్టలు, తాళి, మట్టెలు అందజేసి, వేద పండితుడి ఆధ్వర్యంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా పెళ్లి జరిపాం.

పెళ్లికి వచ్చిన కుటుంబ సభ్యులకు భోజనం ఏర్పాట్లు కూడా చేశాం. కుల మతాలకు అతీతంగా ఆర్ధికంగా వెనుకబడిన నిరుపేదలు, దివ్యాంగ వధూవరులు పెళ్లి కోసం మమ్మల్ని సంప్రదిస్తే వారి వివాహన్ని దగ్గరుండి జరిపిస్తాం’ అని తెలిపారు. వివరాలకు 9246736533 నంబరులో సంప్రదించాలని కోరారు.