25 February, 2026 | 5:04 AM

ఇంటర్, పదవ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

25-02-2026 01:37 AM

రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు

మెదక్, ఫిబ్రవరి 24(విజయక్రాంతి); ఇంటర్, పదవ తరగతి వార్షిక పరీక్షలను పకడ్భందీగా నిర్వహించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు అన్నారు. మంగళవారం రాష్ట సచివాలయం నుండి ఇంటర్ 10వ తరగతి పరిక్షల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, విద్యాశాఖ అధికారులు, వైద్యశాఖ అధికారులు, ఆర్ టి సి అధికారులు, విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి కార్యదర్శులు,కమిషనర్లతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ... ఈ నెల 25 నుండి మార్చి 18 వరకు ఇంటర్ ప్రధమ, ద్వితీయ పరిక్షలు వుంటాయని, పదవ తరగతి వార్షిక పరిక్షలు, మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు ఉంటాయని, ప్రతి పరిక్ష కేంద్రంలో త్రాగునీరు, పారిశుద్యం, వెలుతురు, సరిపడా పర్నిచర్ వుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరిక్ష కేంద్రం వద్ద మెడికల్ క్యాంపు, పోలీస్ బందోబస్తు, ప్రశ్న, జవాబు పత్రాలను పోలీస్ బందోబస్తు మద్య పరిక్ష కేంద్రాలకు తరలించాలన్నారు. విద్యార్ధులు పరిక్ష సమయానికి చేరుకునేలా, ఆర్టిసి అధికారులు బస్సులు నడపాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత మెడికల్ పోలీస్, ఆర్టీసీ, ట్రెజరీ, పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.