26 February, 2026 | 7:36 AM

మెదక్ జిల్లాలో ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు

26-02-2026 12:18 AM

మెదక్, ఫిబ్రవరి 25 (విజయ క్రాంతి) :మెదక్ జిల్లాలో మొదటి రోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర తెలుగు, హిందీ , ఉర్దూ, సంస్కృతం , అరబిక్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసాయి. మొదటి సంవత్సర పరీక్షలలో జనరల్ విభాగంలో 6035 గాను 6021 విద్యార్థులు హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 625 గాను 601  విద్యార్థులు పరీక్షకు హాజరైనారు.

జిల్లాలో మొదటి రోజు 99.42 శాతం నమోదైంది. ఈ సంవత్సరం ఐదు నిమిషాలు నిబంధన అమలు లో ఉండటంతో విద్యార్థులందరూ సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లా లో ఉన్న పరీక్షా కేంద్రాలను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవి, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం పర్య వేక్షించారు.