27 June, 2026 | 7:04 PM

Breaking News

అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ 15వ గ్రాడ్యుయేషన్ డే   •  

నేటితో ముగియనున్న ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు

13-03-2026 01:27 AM

హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి) : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థుల పరీక్షలు ముగిశాయి. గురువారం కెమిస్ట్రీ, కామర్స్ చివరి పరీక్షలు జరిగాయి. శుక్రవారంతో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు ముగుస్తాయి. మార్చి 14న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, 17న జాగ్రఫీ ఉన్నా వాటికి కొద్దిమంది విద్యార్థులు మాత్రమే హాజరవుతారు. మొత్తం పరీక్షలు మార్చి 18న పూర్తవుతాయి.

పరీక్షల ఫీజు చెల్లించకపోవడంతో గత నెల లో దాదాపు 200 మంది విద్యార్థులను ప్రా క్టికల్స్‌కు అనుమతించలేదు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వారికి మార్చి 16 నుంచి ప్రాక్టికల్స్‌ను నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే ఏప్రిల్ 10వ తేదీలోపు ఇంటర్ ఫలితాలు ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు.