అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా అరెస్టు
- దేహామే వాహనంగా డ్రగ్స్ తరలింపు
- ఎల్బీనగర్లో రూ.1.5 కోట్ల విలువైన
- హషీష్ ఆయిల్ పట్టివేత
- ఆరుగురు అరెస్టు, 12 కిలోల హాష్ అయిల్ పట్టివేత
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి
ఎల్బీనగర్, ఆగస్టు 17 : నిషేధిత హషీష్ అయిల్ విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఎల్బీనగర్ ఎస్వోటీ, వనస్థలిపురం పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించా రు. దాడుల సందర్భంగా రూ.1.5 కోట్ల విలువైన 12 కిలోల హషీష్ ఆయిల్ పట్టుకుని, ఆరుగురిని అరెస్ట్ చేసి, రూ, 25 వేల నగదు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీళ్లు తమ శరీరాన్నే వాహనంగా చేసుకుని హషీష్ అయిల్ ను వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు.
హషీష్ అయిల్ ను ప్యాకెట్లుగా నిల్వ చేసి, కాళ్లు, కడుపునకు కట్టుకుని బస్సులో తరలిస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠాను ఎల్బీనగర్ ఎస్వోటీ, వనస్థలిపురం పోలీసులు ఎల్బీనగర్ లోని చింతల్కుంట వద్ద నిర్వహించిన ఆపరేషన్లో ఆరుగురు స్మ గ్లర్లను అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మైన ర్లు ఉన్నారు. నిందితుల నుంచి 12 కిలోల హషీష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. దీని మార్కెట్ విలువ సుమారు రూ.1.5 కోట్లు ఉంటుందని మల్కాజిగిరి సీపీ బి.సు మతి తెలిపారు.
ఈ మేరకు ఎల్బీనగర్ లోని మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి, వివరాలు వెల్లడించారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మాడుగుల మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన గెమ్మెలి శ్రీను(25), ఇతని భార్య నిబియా కేబీ అలియాస్ అమ్ము(27) బెంగళూరులో ఐటీ ఉద్యోగిని.
అలాగే, ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మాడుగుల మండలం రోలుగుంట గ్రామానికి చెందిన చిక్కుడు శరణ్(21), అదే జిల్లా మాడుగుల మండలం బూరెలపనుకు గ్రామానికి చెంది న పాంగి జగదీశ్ అలియాస్ జగ్గా(19), ఇదే గ్రామానికి చెందిన కిల్లో శ్రీను(17), పాంగి శ్రీను(17) ఆరుగురు ముఠాగా ఏర్పడి సులభంగా డబ్బు సంపాదించడానికి నిషేధిత హషిష్ అయిల్ ను విక్రయిస్తున్నారు.
ఏజెన్సీ ప్రాంతాల నుంచి బెంగళూరుకు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి హషీష్ ఆయిల్ను సేకరించి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు తరలిస్తున్నట్లు సీపీ వెల్లడించారు. పక్కా సమాచారంతో ఎల్బీనగర్ లోని చింతలకుంట వద్ద నిందితులను అడ్డుకున్నామని తెలిపారు. పోలీసుల కండ్లు కప్పడానికి కాళ్లకు.. కడుపుకు కిలో చొప్పున హషిష్ అయిల్ ప్యాకెట్లను టేప్ తో చుట్టుకుని వినూత్న పద్ధతిని అనుసరించారు.
ఒక్కొక్కరు రెండు కాళ్లకు కిలో చొప్పున, కడుపుకు మరో కిలో.. మొత్తం 3 కిలోల హషీష్ ఆయిల్ను బ్రౌన్ టేపుతో శరీరానికి కట్టుకుని తరలిస్తున్నారు. నలుగురు క్యారియర్లు రూ.10 లక్షలకు 12 కిలోల హషీష్ ఆయిల్ను బెంగళూరుకు చేర్చేందుకు అక్కడి రిసీవర్ సిజోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు.
నిరుద్యోగ గిరిజన యువతే క్యారియర్లు
ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు గెమ్మెలి శ్రీను, అతని భార్య నిబియా బెంగళూరులో ఉంటున్నట్లు సీపీ తెలిపారు. వీరిద్దరూ గిరిజన ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు డబ్బు ఆశ చూపి క్యారియర్లుగా ఉపయోగించుకుంటు న్నారని వెల్లడించారు. నలుగురు క్యారియర్లలో ఇద్దరు మైనర్లు ఉన్నారని తెలిపారు. గతంలోనూ ఇదే తరహాలో హషీష్ ఆయిల్ను పలుమార్లు తరలించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
ప్రధాన నిందితుడు గెమ్మెలి శ్రీనుపై గతంలోనే నర్సీపట్నం, అడవి అన్నవరం పోలీస్స్టేషన్ల పరిధిలో ఎన్డీపీఎస్ చట్టం కింద డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని సీపీ తెలిపారు. హషీష్ ఆయిల్ సరఫరా చేసిన కృష్ణ, బెంగళూరులోని ప్రధాన రిసీవర్ సి జో ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కో సం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోందని సీపీ తెలిపారు.
మత్తుపదా ర్థాల నిర్మూలనే తమ ప్రధాన లక్ష్యమని, డ్రగ్స్ వి షయంలో అసలు రాజీపడబోమని సీపీ సు మతి తెలిపారు. సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ బి.అనురాధ, ఎస్వోటీ డీసీపీ కె.మనోహర్, అదనపు డీసీపీ ఎండీ షకీర్ హుస్సేన్, వనస్థలిపురం ఏసీపీ కాశీ రెడ్డి, వనస్థలిపురం సీఐ ఎస్.రవి బాబు, ఎల్బీనగర్ ఎస్వోటీ ఇ న్స్ స్పెక్టర్ కె.ప్రతాప్ రెడ్డి తదితరులున్నారు.






