18 August, 2026 | 1:17 AM

కల్యాణలక్ష్మిరద్దు కుట్రలను అడ్డుకుంటాం: బీఆర్‌ఎస్

18-08-2026 12:00 AM

మణికొండ, ఆగస్టు 17 (విజయ క్రాంతి): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథ కాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు. ఎన్నికల్లో తులం బంగారం ఇస్తామని మోసం చేయడమే కాకుండా, హైకోర్టులో ఉద్దేశపూర్వకంగా కౌంటర్ దాఖ లు చేయకుండా పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఈ ప్రజా వ్యతిరేక విధా నాలను నిరసిస్తూ మణికొండ, నెక్నాంపూర్ పరిధిలోని బీఆర్‌ఎస్ శ్రేణులు గండిపేట త హసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వి నతిపత్రం అందజేశారు. ప్రజా సంక్షేమ పథకాల రక్షణ కోసం పోరాటాలు ఉధృతం చే స్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సీతారాం ధూళిపాళ, గుట్టమీది నరేందర్, అందె లక్ష్మణ్ రావు, సుమ నళిని, సుమన్, షకీలా రెడ్డి, రేఖ, శేఖర్ పాల్గొన్నారు.