నేడు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు
24-06-2024 01:07 AM
హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): ఇంటర్ బోర్డు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నది. విద్యార్థులు ఇంటర్ బోర్డు అధి కారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చని బోర్డు సూచించింది. పరీక్షలకు ఫస్టియర్, సెకండియర్ నుంచి సుమారు 4.5 లక్షల మంది హాజరయ్యారు.






