చెంచు మహిళకు తీవ్ర అస్వస్థత!
24-06-2024 01:06 AM
హైదరాబాద్ తరలింపు
నాగర్‌కర్నూల్, జూన్ 23 (విజయక్రాంతి): మొలచింతలపల్లి ఘటనలో తీవ్రంగా గాయపడిన చెంచు మహిళ కాట్రాజు ఈశ్వరమ్మ ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ రఘు తెలిపారు. ఫిట్స్ రావడంతో సిటిస్కాన్ కోసం హైదరాబాద్ తరలించినట్టు చెప్పారు.






