6 May, 2026 | 9:00 AM

బాసర ట్రిపుల్ ఐటీలో ముగిసిన గడువు

24-06-2024 01:08 AM

నిర్మల్, జూన్23 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక ఆర్టీయూకేటీ యూనివర్సిటీలో 2024 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాల గడువు ఆదివారంతో ముగిసింది. ఈ యూనివర్సిటీలో సమీకృత ఆరేళ్ల ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. మొత్తం 1,500 సీట్ల భర్తీకి పదవ తరగతిలో సాధించిన జీపీఏ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్థులు చేసుకున్న వారిలో అర్హులైన వారి జాబితాను జులై 3న ప్రకటించనున్నట్లు ఇన్‌చార్జి వీసీ వెంకటరమణ తెలిపారు. 8, 9, 10 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని ఆయన వివరించారు.