14 April, 2026 | 2:32 AM

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

14-04-2026 12:00 AM

నిర్మల్, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి మండలంలోని గొల్లమోడాకు చెందిన గుల్ల మణివర్ధన్ (16) ఇంటర్ పరీక్షల్లో తప్పడంతో మన స్తాపం చెంది సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు.  కుటుంబ సభ్యులు ఫెయిల్ అయినా ఫర్వాలేదన్నప్పటికీ మణివర్ధన్ గ్రామ సమీపంలో చెట్టుకు ఉరివేసు కున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు విద్యార్థిని కాపాడేందుకు ప్రయత్నించారు. కొన ఊపిరితో ఉన్న మణివర్ధన్‌ను బైంసా ఆసు పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు నర్సాపూర్ జి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.