14 April, 2026 | 2:32 AM

కేటీఆర్ ఎన్ని పొర్లు దండాలు పెట్టినా ప్రజలు పట్టించుకోరు

14-04-2026 12:00 AM

రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ 

హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్‌ను టీఆర్‌ఎస్‌గా మార్చినా ఒరిగేదేమీ లేదని, బీఆర్‌ఎస్ అయి నా, టీఆర్‌ఎస్ అయినా తెలంగాణ ప్రజలు ఆ పార్టీకి వీఆర్ఎస్ ఇచ్చేరని, కల్వకుంట్ల కుటుంబం అంటేనే కుట్రల కుటుంబం అని పిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ విమర్శించారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పదేండ్లు తెలంగాణ అమరులను, ప్రజాసంఘాలను, ఉద్యోగ సంఘాలను గోస పెట్టారని మం డిపడ్డారు.

ఇప్పుడు కొంగ జపం చేస్తున్న కేటీఆర్, గత పదేండ్లు ప్రజలనే కాదు సొంత పార్టీ నేతలను కూడా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి ఆకాశం లాంటి వాడని, ఆకాశంపై ఉమ్మేస్తే వారి మొహంపైనే పడుతుందని, తుడ్చుకోలేక, కడుక్కోలేక కేటీఆర్ ఇబ్బంది పడుతారన్నారు. పాదయాత్ర కాదు.. పొర్లు దండాల యాత్ర పెట్టినా కేటీఆర్‌ను ఎవరూ పట్టించుకోరని, ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.