27 July, 2026 | 12:52 PM

Breaking News

ముత్యాలంపాడు ఎక్స్‌ రోడ్డులో విత్తన మేళా ప్రారంభం   •   రామాలయ కమిటీ చైర్మన్‌పై రాజుకుంటున్న రాజకీయం   •   100 స్తంభాల ఆలయ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలి   •   గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •  

దాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్

13-04-2026 10:05 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్  విక్టర్, పరిశీలించారు. ఎప్పటికప్పుడు ధాన్యం వివరాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తూకం వేయాలని ఆయన సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం నీడ వసతి తప్పకుండా ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా అయన అధికారులకు సూచించారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం ద్వారానే విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని ఆయన ఈ సందర్భంగా రైతులను కోరారు. ఆయన వెంట స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిలు, తదితరులు ఉన్నారు.