17 April, 2026 | 1:22 PM

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

17-04-2026 12:17 PM

ములకలపల్లి,(విజయక్రాంతి):మార్కులు తక్కువ వచ్చాయని మనస్థాపానికి గురైన ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థిని గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలం నరసాపురం గ్రామంలో చోటుచేసుకుంది. ములకలపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నరసాపురం గ్రామానికి చెందిన మేకపోతుల జాహ్నవి(16) ములకలపల్లి లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతుంది.

ఈనెల 11వ తేదీన విడుదలైన ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఫలితాల్లో 340 మార్కులు వచ్చాయి.అప్పటినుంచి విద్యార్థిని మార్కులు తక్కువ వచ్చాయనే మనోవేదనతో బాధపడుతుంది.ఇంట్లో తల్లిదండ్రులు ఉపాధి పనులకు వెళ్లారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లోని దూలానికి చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి దూలానికి వేలాడుతూ కనిపించింది. అప్పటికే ఆ విద్యార్థిని మృతి చెందింది. విద్యార్థిని మృతదేహానికి శివపరీక్ష నిర్వహించి తండ్రి మేకపోతుల రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ములకలపల్లి ఎస్సై మధు ప్రసాద్ తెలిపారు.