ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య
19-04-2026 11:57 AM
హైదరాబాద్: ఓ వివాహిత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పానగల్లులో ఆదివారం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా, పానగల్లు గ్రామానికి చెందిన శివశంకర్ తో ఐశ్వర్యకు ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో ఐశ్వర్య అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఐశ్వర్యను భర్త, అత్తామామలే చంపినట్లు మృత్యురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పూర్తి వవరాలు తెలియాల్సి ఉంది.






