18-02-2026 05:12:53 PM
లక్షెట్టిపేట టౌన్,(విజయక్రాంతి): జిల్లా విద్యాశాఖ ఆదేశాలతో లక్షేట్టిపేట మండలంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఇంటర్నల్ మార్కుల తనిఖీ బృందం బుధవారం పరిశీలన చేశారు. విద్యార్థుల నోటుబుక్స్, ప్రాజెక్ట్ వర్క్స్, స్లిప్ టెస్ట్ ఆధారంగా వేసే 20 మార్కులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సరైన పద్ధతిలో మార్కులు కేటాయింపు చేశారా లేదా అని బృంద సభ్యులు రంగు సత్యనారాయణ, రామన్న, శివయ్య పరీక్షించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి జి శైలజ మాట్లాడుతూ పరిశీలన అనంతరం మార్కులను ఈ 21 నుంచి 27 వరకు ఆయా స్కూల్ లాగిన్ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు.