03-12-2025 06:47:29 PM
చిలుకూరు: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మండల విద్యా వనరుల కేంద్రంలో దివ్యాంగులకు క్రీడ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి ఎం. గురవయ్య మాట్లాడుతూ దివ్యాంగులు ప్రభుత్వ నుండి వచ్చే సౌకర్యాలు పొందాలని ప్రతి బుధవారం కేంద్రంలో నిర్వహించే ఫిజియోథెరపీని సద్వినియోగం చేసుకోవాలని మంచి విద్యను అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగాలను పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు ఉపాధ్యాయులు, సుమలత, పద్మ, ఎంఆర్సి, సిబ్బంది పాల్గొన్నారు.