03-12-2025 06:51:05 PM
సంస్థాన్ నారాయణపూర్ (విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపురం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ మూడో విడత ప్రక్రియ బుధవారం మొదలైంది. మండల వ్యాప్తంగా 31 గ్రామ పంచాయితీలకు గాను ఏడు క్లస్టర్లుగా ఏర్పాటు చేసి 31 సర్పంచ్, 260 వార్డు మెంబర్లకు నామినేషన్ ప్రక్రియ అధికారులు ప్రారంభించారు. తొలిరోజు 14 మంది సర్పంచ్ అభ్యర్థులు, 17 మంది వార్డు సభ్యులుగా నామినేషన్లు దాఖలు చేశారని అధికారులు తెలిపారు. గ్రామాల్లో ఏకగ్రీవాల చర్చ జోరుగా నడుస్తుంది. నారాయణపూర్ మండల పరిధిలోని తండాలలో ఎక్కువగా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి నాయకులు జోరుగా చర్చిస్తున్నారని ఊహాగానాలు వినపడుతున్నాయి. ఇంతలోనే పార్టీల మార్పులు కూడా జోరుగా కొనసాగుతున్నాయి. టికెట్ ఆశించిన నేతలకు భంగపాటు కలగడంతో ప్రత్యామ్నాయంగా ఇతర పార్టీలలో చేరడానికి అభ్యర్థులు మొగ్గు చూపుతున్నారు.