23 June, 2026 | 5:26 PM

Breaking News

గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం   •   ప్రీవెడ్డింగ్ షూట్‌లో ప్రియుడితో కలిసి కాబోయే భర్తను చంపిన యువతి   •   రోడ్డు ప్రమాదంలో డాన్స్ మాస్టర్ మృతి   •   రెవిన్యూ రికార్డులను పరిశీలించిన కలెక్టర్   •   బిగ్ డేటా యుగంలో ఈ-కామర్స్ భద్రతపై పరిశోధనకు పీహెచ్‌డీ   •   మాదిగల్లో అక్షరాస్యత పెంపుకు 40 రోజుల "గో టు విలేజ్" కార్యక్రమం   •   నెల్లిపాక భూములపై ప్రొహిబిషన్ ఎత్తివేయాలి   •   విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్   •   ఐఎస్‌ సదన్‌లో భారీ చోరీ.. రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్   •   రైతులకు అందుబాటులో విత్తన మేళ   •  

ఘనంగా అంతర్జాతీయ అంధుల దినోత్సం

05-01-2026 01:18 AM

సుల్తానాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని వికాసం వికలాంగుల పునరావాస కేంద్రంలో ఘనంగా అంతర్జాతీయ అంధుల దినోత్స వాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ దివ్యాంగుడు ప్రవీ ణ్ కుమార్ హాజరై కేక్ కట్ చేసి, వికలాంగులకు పండ్లు పంపిణీ చేసి వేడుకలను ప్రారంభించారు. సుల్తానాబాద్ మండలం  సుద్దాల గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు అల్లాడి వెంగళరావు వారి తల్లి సత్తెమ్మ, అత్తమ్మ సత్తెమ్మ జ్ఞాపకార్థం పునరావాస కేంద్రానికి రెండు టేబుల్లు బియ్యం  వితరణ చేసి, ఒకరోజు భోజనం కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్వయంగా మానసిక వికలాంగులకు భోజనాన్ని వడ్డించారు.

మానసిక వికలాంగుల పాఠశాలలో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉందని సెంటర్ నిర్వాహకులు శ్రీనివాస్ తెలుపగా విశ్రాంత ఉపాధ్యాయులు ప్రతినెల 500 రూపాయలు అందించనున్నట్లు ప్రకటించి, మొదటి నెల 500 రూపాయలను నిర్వాహకులకు అందజేశారు. సెంటర్ నిర్వాహకుడు శ్రీనివాస్ ప్రతినెలా 500 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్కు అందజేశారు. కార్యక్రమంలో సుల్తానాబాద్ ఎంఈఓ ఆరేపల్లి రాజయ్య, సెంటర్ నిర్వాహకులు శ్రీనివాస్, ఎన్‌హెచ్‌ఎస్ పాఠశాల కరస్పాండెంట్ అన్నమనేని స్వప్న, సంతోష్ రావు, యువ సంకల్ప ఫౌండేషన్ సభ్యులు రమేష్, సెంటర్ సిబ్బంది సరస్వతి, కల్పన ఉన్నారు.