05-01-2026 01:17:10 AM
మంత్రి పొన్నం ప్రభాకర్
కొత్తపల్లి, జనవరి 4 (విజయక్రాంతి): గౌడ్ల సంక్షేమానికి పొన్నం శ్రీనివాస్ గౌడ్ సేవలు మరువలేనివని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం కొత్తపల్లి కేంద్రంలో శ్రీనివాస్ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఆయన సోదరుడు తన అనుంగ అనుచరుడైన పొన్నం సత్యనారాయణగౌడ్ పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. నివాళులర్పించిన వారిలో మంత్రితో పాటు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్ర శేఖర్, కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, బోనాలు శ్రీను తదితరులున్నారు.