31 August, 2026 | 10:36 AM

Breaking News

నేరాల నియంత్రానికే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   40 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   హరీష్ నాయక్ కుటుంబానికి ఎంపీ ‘వేం’ పరామర్శ   •   రాష్ట్ర మహా సభల గోడ పత్రికల ఆవిష్కరణ   •   పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి శ్రీధర్‌బాబు   •   నేడు మహబూబాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన   •   రిటైర్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలి: టీఎస్‌జీఆర్‌ఈఏ జిల్లా అధ్యక్షులు   •   తాజుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్లమెంటరీ నేత   •   జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించం: మాటేటి వేణుగోపాల్   •  

ఇల్లెందులో ఉత్సహంగా ఒలంపిక్ డే రన్

23-06-2025 02:16 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఒలంపిక్ డే సందర్భంగా 18న పాల్వంచలో మొదలైన ఒలంపిక్ రన్ దమ్మపేట, భద్రచలం, మణుగురు మీదుగా సోమవారం ఇల్లందుకు చేరుకుంది. ఒలంపిక్ క్రీడాజ్యోతిని జాతీయ క్రీడాకారుడు సుమిత్ కోరి ఎమ్మెల్యే కోరం కనకయ్యకు  అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ.. ఇల్లందులో క్రీడావసరాలకు అథ్లెటిక్స్ ట్రాక్ కోసం ఐదు ఎకరాలు స్తలం సేకరించాల్సి ఉందని త్వరలో ఆ ట్రాక్ నిర్మాణం పూర్తి చేసి ఇండోర్ స్టేడియం అందుబాటులోకి తెస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా డీఎస్పీ చంద్రభాను మాట్లాడుతూ... ఇల్లందు పరిసర ప్రాంతంలో గిరిజన క్రీడాకారులు అద్భుతంగా రానిస్తున్నారని వారికి మంచి శిక్షణ  ఇవ్వటం ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తారని అన్నారు. జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జి యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులకు క్రీడా సదుపాయాలు కలగజేస్తే యువ క్రీడాకారులు క్రీడల వైపు దృష్టి పెడతారని తెలిపారు. ఈ కార్యక్రమము జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి రాసపల్లి రాజేంద్రాప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించగా సింగరేణి హై ఉన్నత పాఠశాల నుంచి ఒలంపిక్ డే రన్ జగదాంబ సెంటర్ వరకు నిర్వహించగా స్థానిక క్రీడాకారులు చాలా ఉత్సంగా పాల్గొన్నారు.