20 June, 2026 | 2:36 AM

అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్‌లో సత్తా

20-06-2026 12:00 AM

195 కేజీల పవర్ లిఫ్టింగ్ చేసిన కాకతీయ పబ్లిక్ స్కూల్ విద్యార్థి డిలోడ్ గణ్‌రాజ్  

నిజామాబాద్, జూన్ 19(విజయక్రాంతి): ఇటీవల ధాయిల్యాండ్ దేశంలోని బ్యాంకాక్‌లో నిర్వహించిన అంతర్జాతీయ పవర్ లి ఫ్టింగ్ పోటీల్లో నిజామాబాద్ పట్టణంలోని కాకతీయ పబ్లిక్ స్కూల్‌కి చెందిన 6వ తరగతి విద్యార్థి గణ్‌రాజ్ డిలోడ్ ప్రభంజనం సృష్టించాడు. ఆ విద్యార్థి అతి పిన్న వయసులోనే 195 కేజీల పవర్ లిఫ్టింగ్ చేసి రికార్డు సృష్టించాడు. ఈ పోటీల్లో 77 దేశాల నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి న అభినందన సభలో గణ్‌రాజ్ తండ్రి డి లోడ్ శేఖర్ మాట్లాడుతూ గణ్‌రాజ్ గతంలో హైదరాబాద్‌లో 52 కేజీలు, 35 కేజీలు, 80 కేజీల విభాగంలో కూడా పవర్ లిఫ్టింగ్ చేసి పది సంవత్సరాల వయసులోనే రాష్ట్రస్థాయి రికార్డు నెలకొల్పాడని అన్నారు .

నిరంతర దీక్షతో సాధన చేసి న్యూఢిల్లీలో జరిగిన జాతీ య స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో 170 కేజీలు ఎత్తి జాతీయ స్థాయి రికార్డు సృష్టించాడని అన్నారు. ఇటీవల బ్యాంకాక్‌లో 77 దేశాల పవర్ లిఫ్టర్‌లు పాల్గొన్న ఈ పోటీలో 195 కేజీలు పవర్ లిఫ్టింగ్ చేసి రికార్డు సృష్టించాడని అన్నారు. గణ్‌రాజ్‌ను ఎప్పటికప్పుడు ప్రోత్సహించిన కాకతీయ విద్యా సంస్థల యాజమాన్యానికి డిలోడ్ శేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గణ్‌రా జ్ తల్లిదండ్రులను, గణ్‌రాజ్‌ను సన్మానిస్తూ కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్ సీహెచ్ రజనీకాంత్ అభినందించారు. సామాన్య కుటుం బంలో నుంచి వచ్చిన గణ్‌రాజ్ పట్టుదలతో విశేష కృషి చేసి మన నిజామాబాద్ జిల్లా పేరు, తల్లిదండ్రుల పేరు, కాకతీయ పాఠశాల పేరు నిలబెట్టాడని అన్నారు.

గతంలో కాకతీయ విద్యార్థి నిఖత్ జరీన్‌లాగా దిలోడ్ గణ్‌రాజ్ కూడా ఎదుగుతాడని ఆశాభవం వ్యక్తం చేశారు. కాకతీయ పబ్లిస్ స్కూల్ హెడ్మాస్టర్ యండీ ఫరీదొద్దిన్ మాట్లాడతూ విద్యార్థులు ఆటలలో కూడా చక్కగా రాణించేలా నిరంతరం శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. స్పోర్ట్స్ కోటాలో అనేక అవకాశాలు విద్యార్థులు పొందవచ్చని,

దానికి ప్రాక్టీస్‌తోనే ముందుకు వెళ్లాలని విద్యార్థులకు సూచించారు. కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్స్ సీహెచ్ రాజా, తేజస్విని, రామోజీ మా ట్లాడుతూ క్రీడల ద్వారా విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవకుండా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారని అన్నారు. ప్రిన్సిపాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ పాఠశాలలో శిక్షణ, తల్లిదండ్రుల ప్రోత్సాహం రెండూ ఉంటే వి ద్యార్థులు ఇలాంటి విజయాలు తప్పక సాధిస్తారని, మిగతా విద్యార్థులు గణ్‌రాజ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.