ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
మహిళలతో కలిసి కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
కుషాయిగూడ, మార్చి 6 (విజయ క్రాంతి) : అంతర్జాతీయ మహిళా దినోత్స వం సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మహిళలతో కలిసి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమం బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గుడి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సంద ర్భంగా మహిళలు మరియు జీహెచ్‌ఎంసీ మహిళా సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే బండా రి లక్ష్మారెడ్డి కేక్ కట్ చేసి మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు.
అనంతరం మహి ళలకు టిఫిన్ బాక్సులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు అనసూయ రెడ్డి, సుభద్ర, అందాలు, లక్ష్మీ, సత్యవతి, సువర్ణ, రేణుక, ఉమా, మౌనిక, చంద్రకళ, అంజలి, శారద, ప్రేమలత, సరిత, వెంకటమ్మ, హసీనాబేగం, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.




