21 June, 2026 | 7:19 PM

ఆరోగ్యకరమైన జీవనశైలికి... 'యోగా'నే అమూల్యమైన సాధనం

21-06-2026 05:59 PM

శరీరం, ఆత్మను సమతుల్యం చేసేది ప్రాణయమే

నిత్య జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకోవాలి

 జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్

జవహర్ నగర్,(విజయక్రాంతి): ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగానే అమూల్యమైన సాధనమని, నిత్య జీవితంలో యోగాను ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని హఠయోగా ఆశ్రమ నిర్వాహకుడు శంకరాచారి ఆధ్వర్యంలో జవహర్నగర్ ఫ్లవర్ (రోజ్ గార్డెన్) గార్డెన్ లో ఆదివారం యోగా దినోత్సవ వేడుకులు అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వజ్రేష్ యాదవ్ హాజరై మాట్లాడుతూ ఉరుకులు, పరుగుల జీవితంలో మనషులు శారీరంపై శ్రద్ధ వదిలేస్తారని, రకరకాల రోగాలు మనకు తెలియకుండానే ప్రవేశించి జీవితాన్ని నాశనం చేస్తున్నాయని, మనషి చురకత్తిలా మారాలంటే మనసును, శరీరాన్ని ఏకం యోగానే పరమౌషధమని అన్నారు.

యోగా యోగా అంటే ఆసనాలు, ఊపిరి బిగపట్టడమో కాదని, జీవితాన్ని ఆధీనంలోకి తెచ్చుకోవడమని గుర్తు చేశారు. మధుమేహం, బీపీ ప్రాణాయంతో అదుపులోకి వస్తుందని, వయసుతోభేదం లేకుండా యోగా చేయవచ్చని పేర్కొన్నారు. జవహర్నగర్ డంపింగ్ దుర్వాసనతో ప్రజలు తీవ్రమైన శ్వాసకోస వాధ్యుల బారీన పడుతున్నారని, వారికి యోగానే చక్కటి పరిష్కార మార్గమని తెలిపారు. పేదలను దృష్టిలో పెట్టుకొనే ఇంటిగ్రేటెడ్ పాఠశాలను కేటాయించామని, పనులు త్వరలోనే మొదలవుతాయన్నారు.

యోగా ఆశ్రమం కోసం త్వరలోనే 2 ఎకరాల స్థలాన్ని కేటాయించేలా కృషి చేస్తానని తెలిపారు. అనంతరం యోగా గురువు శంకరాచారి చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఉత్తరాఖండ్ రిషికేసులో గల రుద్రయోగ ఫీట్ లో హఠయోగ అష్టాంగ యోగ విద్యలో శిక్షణ పొందిన ప్రముఖ యోగ గురువు శంకరాచారి ఆధ్వర్యంలో పిల్లలు పెద్దలు రాజకీయ ప్రముఖులు చక్కటి ఆసనాలు సూర్య నమస్కారాలు చేసి అందరిని అలరించారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడారు.