అంతర్రాష్ట్ర దొంగలముఠా సభ్యుడు అరెస్ట్
త్వరలో మిగతా ముఠాసభ్యులను పట్టుకుంటామన్న ఎస్పీ
కామారెడ్డి, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి) ః నేరాలకు పాల్పడే వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుడిని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు ఎస్పి పేర్కొన్నారు. వాహనాల తనికెల్లో పట్టుబడ్డ మధ్యప్రదేశ్ దొంగ రాజస్థాన్ నెంబర్ ప్లేట్ వాహనంతో వాహనం నడుపుతు 9 మంది అంతరాష్ట్ర కు చెందిన ముఠా కామారెడ్డి ప్రాంతంలోచోరీలకు పాల్పడుతున్నారని తెలిపారు.
త్వరలోనే మిగతా ముఠా సభ్యులను పట్టుకుంటామని ఎస్పీ వెల్లడించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మర్కల్ గ్రామానికి చెందిన గుండ్రెడ్డి గంగాధర్ తన అత్తగారు పని నిమిత్తం హైదరాబాద్ ప్రతిరోజు తన భార్య అత్తగారిల్లు పరిశీలిం చేది. గత జూలై 19న ఉదయం వెళ్లి చూసేసరికి ఇంటి తాళాలు పాలకొట్టి బీరువా విరగగొట్టి అందులో ఉన్న రెండు తులాల బంగారు చైను, 25వేల నగదు దొంగలించబడినట్లు సదాశివ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అదే గ్రామానికి చెందిన గుర్రపు మహేష్ తన పాత ఇంటిలో కిరాణా షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తుండగా గత జూలై 18న షాపు మూసి ఇంటికి వెళ్లి 19న ఉదయం వచ్చి చూసేసరికి షాపు తాళం పాలగోట్టి కౌంటర్ నుండి 12వేల నగదు రెండో గదిలోని బీరువా నుండి రెండు తులాల వెళతాడు మూడు జతల వెండి పట్టగొలుసులు దొంగలించబడినట్లు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనలపై సదాశినారు పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్పీ తెలిపారు.
సీసీటీవీ కెమెరాల ద్వారా అనుమానిత వ్యక్తుల కదలికలను పరిశీలించగా మంగళ వారం నమ్మదగిన సమాచారం మేరకు కల్వరాల స్టేజి వద్ద వానాల తరంగి నిర్వహిస్తుండగా పోలీసులు గమనించుకో వ్యక్తి తన కారణ వెనక్కి తిప్పుకొని పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ పోలీసులు వెంబడించి పట్టుకొని విచారించగా అతని పేరు సికిందర్ సోలార్ దర్బార్ ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడిగా పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. అతనితోపాటు తొమ్మిది మంది సభ్యుల ఒక ముఠాగారిపడి దొంగతనాల పాల్పడు తున్నట్లు తెలిపాడు.
నేరాలు చేసే సమయంలో అడ్డుపడినట్లయితే కత్తులు రాడ్లు చూపిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి అవసరమైతే వారి ప్రాణాలకు హానిచేసి దొంగతనాలు చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. అతని వద్ద నుంచి స్మార్ట్ ఫోన్, ఎర్టిగా కార్, కత్తి, టార్చ్ లైట్, కటింగ్ ప్లేయర్, 2600 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సదాశివ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, ఎస్త్స్రలు పుష్పరాజ్ ఉస్మాన్ ఐడి కోర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సిసిఎస్ కానిస్టేబుల్ శ్రీనివాస్ లక్ష్మీకాంత్ మైసయ్య శ్రావణ్ సహస్ర క్రైమ్ పార్టీకి చెందిన రవి మీ జిల్లా ఎస్పీ అభినందించారు.






