కేసీఆర్ మీద కుట్ర కాదు..కాళేశ్వరం మీద కుట్ర
03-09-2025 12:36 AM
బీఆర్‌ఎస్ నేత రాకేశ్ రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజ యక్రాంతి): సీబీఐ విచారణ అనేది కేసీఆర్ మీద చేసిన కుట్ర కాదు, తెలంగాణకు జీవనాడి అయిన కాళేశ్వరం మీద, తెలంగాణ ప్రజల మీద చేసిన కుట్ర అని బీఆర్‌ఎస్ నాయకులు ఏనుగుల రాకేశ్‌రెడ్డి విమర్శిం చారు. కాళేశ్వరంపై అనేక అపో హలు, కాంగ్రెస్ బురద రాజకీ యం, అసెంబ్లీలో చర్చ, జస్టిన్ పీసీ ఘోష్ కమిషన్ నేపథ్యం లో నిజానిజాలు ప్రజల మధ్య పెట్టాలన్న ఉద్దేశ్యంతో గత నెల 28, 29, 20 తేదీలలో 3 రోజుల పాటు కాళేశ్వరం ప్రాజె క్ట్ మొత్తం స్టడీ టూర్ చేసినట్లు ఆయనత తెలిపారు. దానికి సంబంధించిన వివరాలను ఆయన మంగళవారం తెలం గాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్ల డించారు.






