నూతన వీఆర్‌వోలకు నియామక పత్రాలు
5న సీఎం చేతుల మీదుగా అందజేత
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): నూతనంగా నియమితులైన 5 వేల మంది విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ల(వీఆర్‌వో)కు ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియామక పత్రాలను అందజేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తెలిపారు. వీఆర్‌వోలకు నియామక పత్రాలను మాదాపూర్‌లోని హైటెక్స్‌లో 5వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు అందజేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హాజరవుతారని తెలిపారు.
ఈ కార్యక్రమ ఏర్పాట్లపై మంగళవారం సంబంధిత శాఖ కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ జిల్లాల నుండి ఎంపికైన వీఆర్వోలు మధ్యా హ్నం రెండు గంటల లోపు హైటెక్స్ చేరుకునేలా ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామని చెప్పారు. కార్యక్రమానికి హాజరయ్యే వారికి దాదాపు 120కి పైగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీని ఆదేశించారు.
టెలీ కాన్ఫరెన్స్‌లో ఆర్‌అం డ్‌బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి, ఫైర్ సర్వీస్ డీజీ నాగిరెడ్డి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.






