27 June, 2026 | 7:26 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

కారుణ్య నియామకాల కొరకు ముఖాముఖీ

08-05-2025 07:17 PM

ఇల్లెందు (విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియా జి.యం. వి.కృష్ణయ్య ఆదేశాల మేరకు కారుణ్య నియామకాల కొరకు మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన ఉద్యోగుల వారసులకు జి.యం కార్యాలయంలో గురువారం ముఖాముఖీ (ఇంటర్వ్యూ) నిర్వహించారు. ఈ సందర్భముగా సి.హెచ్.పి. ఇంజనీర్ క్రిస్టఫర్ మాట్లాడుతూ.. ఇల్లందు ఏరియా వర్క్ షాప్ నుండి కారుణ్య నియామకాల కొరకు మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన ఉద్యోగి వారసురాలికి వారి కుటుంబ సభ్యుల, సాక్షుల సమక్షంలో ఇంటర్వ్యూలు నిర్వహించి అన్నివివరాలు నమోదు చేయడమైనదని, ఇంటర్వ్యూలు పూర్తి అయిన తరువాత వైద్యపరీక్షల కొరకు పంపించి తరువాత నియామక ఉత్తర్వులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా వర్క్ షాప్ డి.జి.యం.నాగరాజు నాయక్, ఏరియా డి.జి.యం. (పర్సనల్) జి.వి.మోహన్ రావు, సీనియర్ పర్సనల్ అధికారి సాయి స్వరూప్,  క్లార్క్స్ శ్రీనివాస్, అపర్ణ, తదితరులు పాల్గొన్నారు.