15 April, 2026 | 12:04 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

రైతులకు నకిలీ విత్తనాలు అంటగడితే పీడీ యాక్ట్ తప్పదు

16-06-2025 12:08 AM

విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆకస్మిక తనిఖీలు

అచ్చంపేట, జూన్ 15:భూతల్లినే నమ్ముకొని వ్యవసాయంపై ఆధారపడి బ్రతుకుతున్న రైతులకు పంటలు పండించే క్రమంలో ఎరువులు విత్తనాలు నకిలీవి అంటగడితే దుకాణదారులపై పిడి యాక్ట్ నమోదు తప్పనిసరి చేస్తామని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ హెచ్చరించారు. ఆదివారం పట్టణంలోని పలు ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయా దుకాణాల్లోని రిజిస్టర్లు, ఎరువులు విత్తనాలను, స్టాక్ పాయింట్ లను విపులంగా పరిశీలించారు. నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులపై పీడీ యాక్ట్ నమోదుతో పాటు వారి లైసెన్సులు సీజ్ అవుతాయన్నారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్టు సమాచారం ఉంటే, రైతులు స్థానిక పోలీస్ స్టేషన్, వ్యవసాయ అధికారి కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు. వారితోపాటు జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేందర్ తదితరులుఉన్నారు.