సఖి కేంద్రంలో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 19 (విజయక్రాంతి): జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రంలో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు.మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఇంటర్వ్యూలకు ఆమె కమిటీ సభ్యులతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సఖి కేంద్రంలో పొరుగు సేవల ప్రాతిపదికన పని చేసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రతిభ ఆధారంగా ఎంపిక చేపడుతున్నట్లు తెలిపారు.
సెంటర్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుకు 8 మంది, న్యాయ సలహాదారు పోస్టుకు 4 మంది, కేస్ వర్కర్ పోస్టుకు 6 మంది, ఐటీ అసిస్టెంట్-అకౌంటెంట్ పోస్టుకు 6 మంది, మల్టీపర్పస్ వర్కర్ పోస్టుకు 32 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. అర్హత, ప్రతిభ ఆధారంగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి స్వరూపారాణి, కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.






