calender_icon.png 17 February, 2026 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముద్దూముచ్చట్ల మధ్య కావేరి పరిచయం

17-02-2026 12:05:49 AM

రవితేజ హీరోగా నటిస్తున్న 77వ సినిమా ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ కథానాయిక. బేబీ నక్షత్ర రవితేజ కుమార్తెగా నటిస్తుండగా, సాయికుమార్, అజయ్ ఘోష్, రమేశ్ ఇందిరా, స్వసిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమా నుంచి తాజాగా మహా శివరాత్రి సందర్భంగా హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ప్రియా భవానీ శంకర్‌ను ‘కావేరి’గా పరిచయం చేస్తూ ఈ పోస్టర్‌ను పంచుకున్నారు మేకర్స్. రవితేజ ఇందులో ప్రియా చెంపపై ప్రేమగా ముద్దుపెడుతుండగా, ఆమె చిరునవ్వుతో ఆకట్టుకుంటున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథలో నాయకానాయికల మధ్య ఉండే ఆప్యాయతను ఈ పోస్టర్ ఆవిష్కరించింది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్; డీవోపీ: విష్ణుశర్మ; ప్రొడక్షన్ డిజైన్: సాహి సురేశ్; ఎడిటింగ్: ప్రవీణ్ పూడి.