27 May, 2026 | 7:48 PM

Breaking News

మంత్రులు పొన్నం, అజారుద్దీన్ ముందే కొట్టుకున్న ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్   •   ప్రొఫెసర్ నాగేశ్వరరావు అక్రమ అరెస్టును ఖండించిన ప్రజా సంఘాలు   •   రంగంపేటలో ధాన్యం లారీల కోసం రోడ్డు ఎక్కిన రైతన్న   •   కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ వేయాలని ఉదృతమవుతున్న పోరాటం   •   బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతాంగానికి చేరే విధంగా చూడాలి   •   విద్యుత్ షాక్ తగిలి ఐదు బర్రెలు మృతి   •   బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు   •   ఉట్నూర్ ఆర్డీవ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ సింగ్   •   NEET 2026 Paper leak caseలో సీబీఐ దూకుడు.. 13కి చేరిన అరెస్టుల సంఖ్య   •  

తెలంగాణ టూరిజంలో పెట్టుబడులు పెట్టండి

08-11-2024 01:26 AM

ప్రవాసులకు  మంత్రి జూపల్లి పిలుపు

హైదరాబాద్, నవంబర్ 7(విజయక్రాంతి): తెలంగాణ పర్యాటక అభివృద్ధికి చేయూతనిచ్చేందుకు పెట్టుబడులు పెట్టాలని ప్రవాసులకు టూరిజంశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. లండన్‌లో జరుగుతున్న వరల్డ్ ట్రావెల్ మార్కె ట్ ఈవెంట్ గురువారం ముగిసింది. ఈ వేడుకల్లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో కలిసి మంత్రి జూపల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టాల్‌ని సందర్శించిన కేంద్రమంత్రిని జూపల్లి సన్మానించి చార్మినార్ జ్ఞాపికను అం దజేశారు.

అనంతరం జూపల్లి మాట్లాడుతూ తెలంగాణ వారసత్వ సంపదను ప్రపంచ దేశాల పర్యాటకులకు తెలిసే విధంగా ఈ వరల్డ్ ట్రావెల్ మార్కెట్‌లో ప్రచారం చేశామన్నారు. దీంతో తెలంగాణకు విదేశీ పర్యాటకులు భారీగా వచ్చే అవకాశం ఉందని  వెల్లడించారు.