27 May, 2026 | 8:37 PM

Breaking News

మంత్రులు పొన్నం, అజారుద్దీన్ ముందే కొట్టుకున్న ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్   •   ప్రొఫెసర్ నాగేశ్వరరావు అక్రమ అరెస్టును ఖండించిన ప్రజా సంఘాలు   •   రంగంపేటలో ధాన్యం లారీల కోసం రోడ్డు ఎక్కిన రైతన్న   •   కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ వేయాలని ఉదృతమవుతున్న పోరాటం   •   బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతాంగానికి చేరే విధంగా చూడాలి   •   విద్యుత్ షాక్ తగిలి ఐదు బర్రెలు మృతి   •   బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు   •   ఉట్నూర్ ఆర్డీవ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ సింగ్   •   NEET 2026 Paper leak caseలో సీబీఐ దూకుడు.. 13కి చేరిన అరెస్టుల సంఖ్య   •  

విలక్షణ నాయకుడు రేవంత్‌రెడ్డి

08-11-2024 01:26 AM
  1. చిన్న వయసులోనే డైనమిక్ లీడర్‌గా ఎదిగారు 
  2. 'ఒక్కే ఒక్కడు’  పుస్తకావిష్కరణలో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ 

హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విలక్షణ మైన నాయకుడని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రశంసించారు. చిన్న వయసులోనే రాజకీయాల్లో డైనమిక్ లీడర్‌గా ఎదిగారని ఆయన కొనియాడారు. సీఎం రేవంత్‌రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో ‘ఒకే ఒక్కడు’ పుస్తకాన్ని మహేశ్‌కుమార్‌గౌడ్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డికి పార్టీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండాల ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు.