12-05-2025 01:30:47 AM
ఆరాధ్య గ్రీన్ వల్లీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ల సమావేశంలో ఆల సాంబిరెడ్డి
హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): భవిష్యత్తును భద్రపరచుకోవడానికి భూమిపై పెట్టుబడి పెట్టడం ఒక కీలకమైన వ్యూహమని ఆల సాంబిరెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక సింధూర హోటల్‌లో ఆరాధ్య గ్రీన్ వల్లీ రియల్ ఎస్టేట్ వారు ఏర్పాటుచేసిన ఏజెంట్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యక్తులు స్థిర డిపాజిట్లు, బంగారం, స్టాక్ మార్కెట్లపై శ్రద్ధ పెడుతున్నారని, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడితే ఎక్కువ ఆదాయం ఉంటుందని తెలిపారు.
రాజధాని అమరావతి దగ్గర్లోని పలకలూరు మూడోఫేస్‌లో నూతనంగా కట్టబడిన ఆరాధ్య గ్రీన్ వ్యాలీ వారు కట్టిన అపార్ట్‌మెంట్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల సమగ్రమైన లాభం పొందవచ్చు అని చెప్పారు.
రియల్ ఎస్టేట్ తన ఎదుగుదలకు ఎంతో దోహదం చేసిందని తెలిపారు. రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చిన డబ్బును విద్యా సంస్థలు కట్టడానికి దోహదపడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయ మాస్టారు, మేక వెంకట్‌రెడ్డి, పాపిరెడ్డి, పెరుగు సుధాకర్ యాదవ్, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.