16 July, 2026 | 12:37 AM

ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ హైస్కూల్‌లో 16వ ఇన్వెస్టిచర్ వేడుక

16-07-2026 12:00 AM

ముషీరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): ఆక్స్ఫర్డ్ గ్రామర్ హై స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన 16వ ఇన్వెస్టిచర్(బాధ్యతల స్వీకారోత్సవం) వేడుక ను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 83 మంది విద్యార్థి మండలి సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేజర్ జనరల్(రిటైర్డ్) ఎస్.కె.మాథూర్, విశిష్ట అతిథిగా అల్కా మాథూర్ హాజరయ్యారు. పాఠశాల డైరెక్టర్ ప్రార్థన మణికొండ, కరస్పాండెంట్ కె.ప్రభాకర్, డీన్ రామాంజుల, ప్రిన్సిపాల్ రేఖారావు అతిథులను స్వాగతించారు.

విద్యార్థులు క్రమశిక్షణ, నిజాయితీ, సేవాభావంతో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని ఎస్.కె. మాథూర్ సూచించగా, ప్రత్యేక ప్రతిభను గుర్తించి నిరంతరం నేర్చుకోవాలని ప్రార్థన మణికొండ తెలిపారు. కలల సాధనకు కృషి అవసరమని రామాంజుల, విజయానికి ఏకాగ్రత, పట్టుదల ముఖ్యమని రేఖారావు పేర్కొన్నారు. అనంతరం విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలు ప్రదానం చేసి ప్రమాణ స్వీకారం నిర్వహించగా, హెడ్ బాయ్, హెడ్ గర్ల్ బాధ్యతాయుతంగా సేవ చేస్తామని హామీ ఇచ్చారు.