4 August, 2026 | 1:53 AM

బోనాల జాతరకు హాజరుకావాలని కేటీఆర్‌కు ఆహ్వానం

04-08-2026 12:13 AM

ముషీరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): ఈ నెల10న (సోమవారం) రాంనగర్ లో జరగనున్న బోనాల జాతరకు హాజరుకావాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రె సిడెంట్ తారక రామారావు (కేటీఆర్)ను బోనాల నిర్వాహకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా సోమవారం జాతర ఆహ్వాన పత్రికను కేటీఆర్కు అందజేసి కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్య క్రమంలో బీఆర్‌ఎస్ నేత రేషం మల్లేష్, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, ఎం.ఎన్. శ్రీనివాస్ రావు, కల్వ గోపి, నేత శ్రీనివాస్, అజయ్ ముదిరాజ్, రమేష్, మధు, రేషం మణికంఠ తదితరులు పాల్గొన్నారు.