4 August, 2026 | 2:02 AM

ఆరుతడి పంటలు సాగు చేయాలి

04-08-2026 12:14 AM

కలెక్టర్ సి.నారాయణరెడ్డి

రంగారెడ్డి, ఆగస్టు 3(విజయక్రాంతి): వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావాన్ని తట్టుకునేలా రైతులను సమాయత్తం చేయడానికి రాష్ట్ర నిపుణుల కమిటీ రూపొం దించిన ప్రత్యేక సాగు మార్గదర్శక పుస్తకాన్ని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నీటి లభ్యతను బట్టి రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలు, కూరగాయలు, ఆయిల్ పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని సూచించారు.

ఈ పుస్తకంలో పేర్కొన్న శాస్త్రీయ సాగు విధానాలు, నీటి యాజమాన్య పద్ధతులు రైతులకు మెరుగైన దిగుబడులు సాధించడంలో ఉపయోగపడతాయని తెలిపారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో విస్తృత అవగాహన సదస్సులు నిర్వహించి, రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు తక్షణమే అందించాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.