1 July, 2026 | 2:02 AM

ఆటా సభలకు పొన్నం రవిచంద్ర, శ్యాంప్రసాద్‌లకు ఆహ్వానం

01-07-2026 01:09 AM

బోయినపల్లి, జూన్ 30 (విజయక్రాంతి): అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆట) 19వ సభలకు జిల్లాకు చెందిన ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం సొసైటీ ఆఫ్ సౌతర్న్ రీజియన్, ఇండియా జాయింట్ సెక్రటరీ పొన్నం రవి చంద్ర, సివిల్ సప్లై డైరెక్టర్ శ్యాంప్రసాదాల్ కు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆట అధ్యక్షుడు జయంత్ చల్ల, కన్వీనర్ శ్రీధర్ బానాలలు ఆహ్వానం పంపారు. ఈ నెల 31 నుంచి ఆగస్టు 2 వరకు అమెరికాలోని మేరిలాండ్లో జరిగే ఆట కాన్ఫరెన్స్, యూత్ కన్వెన్షన్లో అతిథులుగా పొన్నం రవిచంద్ర, శ్యాంప్రసాద్ లు పాల్గొననున్నారు. ఆట సభలకు ఆహ్వానం అందడం పట్ల వారికి పలువురు అభినందనలు తెలిపారు.