అతిధి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుకుమార్
కామారెడ్డి, జూలై 19 (విజయక్రాంతి): కామారెడ్డి లోని ప్రభుత్వ ఆరట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ విద్యార్థులకు 2026-27 విద్యా సంవత్సరానికి బోధించుటకు ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొ కె.విజయ్ కుమార్ తెలిపారు. కళాశాల అతిథి అధ్యాపకులుగా బోధించేందుకు తెలుగు-3, ఇంగ్లీష్-2, హిందీ-1, హిస్టరీ-1, బీకాం( రిటైల్ ఆపరేషన్ ) -1, బిబిఏ-1, కంప్యూటర్ సైన్స్‌అండ్‌అప్లికేషన్స్-4, ఫిషరీస్-2,ఫారెస్ట్రీ-2, హెల్త్ కేర్ -1,గణితం-2, ఫిజిక్స్-1, స్టాటస్టిక్స్-1, జువాలజీ -1 సంబంధిత సబ్జెక్టులలో 55% మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండా లన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీసం 50% మార్కులు ఉండాల అని పేర్కొన్నారు.
ప్రత్యేక అర్హత
బి.బి.ఎ బోధించుటకు ఎంబీఏ పూర్తి చేసి ఉండాలి. బి.కాం (రిటైల్ ఆపరేషన్) బోధించుటకు ఎం కామ్ లేదా ఎం బి ఏ అర్హత కలిగి ఉండాలన్నారు. హెల్త్ కేర్ మేనేజ్మెంట్ బోధించుటకు జువాలజీ లేదా మైక్రోబయాలజీలో పీజీ పూర్తి చేసి ఉండాలన్నారు. పీహెచ్డీ,నెట్, సెట్ అర్హతలతో పాటు బోధనా అనుభవం ఉన్న వారికి నియామకంలో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నారు. కళాశాల విద్యా కమిషనర్ నిబంధనల ప్రకారం పారదర్శకంగా సెలక్షన్ నిర్వహించబడుతుందన్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 21 సాయంత్రం 4 గంటల లోపు తమ దరఖాస్తులను కళాశాల పనివేళల్లో కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. ఇంటర్వ్యూలు 22 న బుధవారం ఉదయం10 గంటల నుండి ప్రభుత్వ ఆరట్స్ అండ్ సైన్స్ కళాశాల కామారెడ్డి (స్వయం ప్రతిపత్తి )నందు నిర్వహించబడుతుందని తెలిపారు, అభ్యర్థులు తమ సర్టిఫికెట్స్, జిరాక్స్ ప్రతులు, బయోడేటా తో నిర్ణీత సమయానికి ఇంటర్వ్యూకు హాజరు కావాలని కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.కె విజయకుమార్ ఒక ప్రకటనలో కోరారు.






